ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కమిటీ నివేదిక రాకుండా ఎలా డిశ్చార్జ్ చేస్తారు..?: తెదేపా నేతలు

మాజీమంత్రి అచ్చెన్నాయుడి డిశ్చార్జి పై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల కమిటీ నివేదిక రాకుండా ఎలా డిశ్చార్జ్ చేస్తారని ప్రశ్నించారు.

ACHANNAIDU DISCHARGE TENTION IN GUNTUR GGH
తెదేపా నేతలు

By

Published : Jul 1, 2020, 8:18 PM IST

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసన మధ్య గుంటూరు సర్వజనాస్పత్రి నుంచి మాజీమంత్రి అచ్చెన్నాయుడును డిశ్చార్జ్ చేశారు. అనిశా కోర్టు ఆదేశాల మేరకు గత నెల 13న అతడిని జీజీహెచ్​లో చేర్చారు. రెండోసారి ఇక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. ఇటీవలే అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వం వైద్యుల కమిటీని నియమించింది. చివరకు ఇవాళ సాయంత్రం ఊహించని విధంగా వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.

గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేనప్పటికీ అచ్చెన్నాయుడిని బలవంతంగా జీజీహెచ్ నుంచి తరలించడం పట్ల తెదేపా నేతలు, కార్యకర్తలు తీవ్రం అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల వైద్యుల కమిటీని ప్రభుత్వం వేయగా... ఆ కమిటీ నివేదిక రాకుండానే... కొలనోస్కోపీ, ఇతర పరీక్షల పళితాలు వెల్లడి చేయకుండానే అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం కక్షపూరిత చర్య అంటూ అతని తరపు న్యాయవాది హరిబాబు ఆరోపించారు. మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నిరసన వ్యక్తం చేశారు.

  • వైద్యులపై ఒత్తిడి తెచ్చి డిశ్చార్జ్ చేయిస్తారా?: యనమల

ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడి డిశ్చార్జ్​ను శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఖండించారు. ఆసుపత్రులను కూడా వైకాపా ప్రభుత్వం మేనేజ్​ చేయడం గర్హనీయమన్నారు. వైద్యులపై ఒత్తిళ్లు తెచ్చి బలవంతంగా డిశ్చార్జ్ చేసి అచ్చెన్నాయుడిని జైలుకు పంపడం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. ఎర్రన్నాయుడి కుటుంబంపై జగన్ పగబట్టారని....తనను జైలుకు పంపారనే అక్కసుతో కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. సాక్ష్యాధారాలతో సహా అంబులెన్స్​ల కుంభకోణాన్నితెదేపా బైటపెట్టిందని...అయినా ప్రభుత్వం నిందితుల పై విచారణ కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. బీసి కాబట్టే అచ్చెన్నాయుడిపై కక్ష సాధిస్తున్నారని.. అదే అంబులెన్స్​ల అవినీతి నిందితులను ఎందుకని అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వైకాపా అవినీతి బురదలో కూరుకుపోయి... ఆ బురదను తెదేపాకి అంటించాలని చూడటం గర్హనీయన్నారు.

ఇవీ చదవండి:అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం:చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details