Fake bail documents: గుంటూరుకు చెందిన భానుప్రకాష్, తెనాలికి చెందిన భువనేశ్వర్ 2019లో జరిగిన దారి దోపిడీ కేసులో అరెస్టై సబ్ జైలులో ఉన్న సమయంలో జామీను పొంది తిరిగి వాయిదాలకు న్యాయస్థానానికి హాజరు కావడం లేదు. దీంతో న్యాయస్థాన సిబ్బంది జామీనుదారులకు నోటీసుల ఇవ్వడానికి ప్రయత్నించగా.. వారు ఆ చిరునామాలో లేరని, అవి నకిలీవని తేలింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి సమాచారం సేకరించి, నిందితులను ఆధారాలతో సహా పట్టుకున్నారు.
నకిలీ బెయిల్ పత్రాలతో.. న్యాయస్థానాన్నే మోసం చేయాలనుకుని.. - గుంటూరులో నకిలీ బెయిల్ పత్రాల కేసులో నిందితుల అరెస్ట్
Fake bail documents: నకిలీ జామీను పత్రాలతో న్యాయస్థానాన్నే మోసం చేసిన కేసులో నిందితులను తెనాలి వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద పలు నకిలీ పత్రాలు లభించిన నేపథ్యంలో ఈ తరహా ఘటనలు మరిన్ని జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
నిందితులు జైలులో ఉన్న సమయంలో వారికి జామీను కోసం కుటుంబ సభ్యులు నందివెలుగు గ్రామానికి చెందిన న్యాయవాది గుమస్తాను ఆశ్రయించారు. అతని ద్వారా గుంటూరుకు చెందిన జాషువా నకిలీ జామీనుదారులను ఏర్పాటు చేయగా.. నకిలీ ధ్రువపత్రాలను గుంటూరులోనే కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ నడిపే భవానీశంకర్ సిద్ధం చేశాడు. చిలకలూరిపేటకు చెందిన సురేష్, కోటేశ్వరమ్మ జామీనుదారులుగా వ్యవహరించారు. ఆధారాలతో ఈ నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు న్యాయవాది గుమస్తా కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో డీఎస్పీ డాక్టర్ కె.స్రవంతిరాయ్ కేసు వివరాలు తెలిపారు.
ఇవీ చదవండి: