ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీసీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడికి దేహశుద్ధి - video viral

Viral Video : బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడు రంగనాథ్​కు ఓ మహిళ దేహశుద్ధి చేసింది. అధిక వడ్డీ ఆశచూపి డబ్బులు తీసుకొని ఇవ్వకపోగా.. తన గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని భర్తతో కలిసి దాడి చేసింది. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

A woman attack on former president of BC welfare society
బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడికి దేహశుద్ధి

By

Published : Mar 28, 2022, 4:20 PM IST

Viral Video : బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడు పరాశ రంగనాథానికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో మహిళలకు మాయమాటలు చెప్పి నగదు తీసుకోవడంతోపాటు, నమ్మించి మోసం చేశాడని కొంతమంది మహిళలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడికి దేహశుద్ధి

తాజాగా.. రంగనాథం ఆగడాలు భరించలేని ఓ మహిళ.. రెండు రోజుల క్రితం రంగనాథ్​పై దాడికి పాల్పడింది. అధిక వడ్డీ ఇస్తానంటూ రూ.15 లక్షలు తీసుకున్నాడని పేర్కొంది. ఆ డబ్బులు ఇవ్వకపోగా తన గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ.. భర్తతో కలిసి రంగనాథానికి దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details