ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మహిళల అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేక కార్యాచరణ'

వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళలను కాపాడటంతో పాటు వారికి సమగ్రమైన పునారావాసం కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. 100 రోజుల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడించారు.

vasireddy padma
vasireddy padma

By

Published : Dec 9, 2020, 4:58 PM IST

మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళలను కాపాడటంతో పాటు వారికి సమగ్రమైన పునారావాసం కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. గుంటూరులో మహిళా మార్చ్ సదస్సులో ఆమె పాల్గొన్నారు.

మహిళల సమస్యలను పరిష్కరించేందుకు 100 రోజుల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. మహిళలను అక్రమ రవాణా నుంచి కాపాడిన తర్వాత వారికి పూర్తి స్థాయిలో పునరావాసం, పరిహారం అందించే విషయంలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details