మద్యం మత్తులో ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకున్న(man Suicide by cutting off arm) ఘటన గుంటూరులో జరిగింది. పాత గుంటూరుకు చెందిన మైనం బాలకృష్ణ.. కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచు బార్య పిల్లలపై దాడి చేసేవాడని విచారణలో తేలిందని పాత గుంటూరు సీఐ వాసు తెలిపారు.
ఈ క్రమంలో అతని వేదిపులు తట్టుకోలేక భార్య.. పిల్లలతో సహా పుట్టిటికి వెళ్లింది. ఒంటరిగా ఉంటున్న బాలకృష్ణ మద్యం సేవించి ఇంటిలో ఎవరూ లేని సమయంలో చాకుతో చేతిని కోసుకొని ఆత్మహత్య(Man intoxicated to commits suicide) చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసు చెప్పారు.