తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వదిలి వెళ్లిపోయిందని.... ఆమెను తనకు అప్పజెప్పాలంటూ ఓ వ్యక్తి గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న అతనిని చట్టపరంగా శిక్షించాలని బాధితుడు కోరాడు.
గుంటూరు దేవనగర్కి చెందిన చందులాల్ నాలుగు సంవత్సరాల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. చందులాల్ వడ్రంగి పనులు చేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిసున్నాడు. అతని భార్యకు ఆమె స్నేహితురాలి ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితో ఈమె తరచూ ఫోన్లు మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ ఉండేదని చందూలాల్ వెల్లడించారు. అనుమానంతో తన భార్య ఫోన్ తీసుకుని పరిశీలించగా జస్వంత్ అనే వ్యక్తి ఫోటోలు, మెసేజ్లు ఉన్నాయని బాధితుడు తెలిపాడు. ఇది మంచి పద్ధతి కాదని మందలించటంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టినింటికి వెళ్లిందని.... అత్తారింటికి వెళ్లి కాపురానికి రమ్మంటే రావటం లేదని చెప్పాడు. తన భార్యకు ఆమె తల్లి కూడా మద్దతు పలుకుతోందని వాపోయాడు.