గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 817 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 21,855కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 161 ఉన్నాయి. ఇక నరసరావుపేట 135, రేపల్లె 61, కొల్లిపర 44, మాచర్ల 39, వట్టిచెరుకూరు 39, రొంపిచెర్ల 39, నూజెండ్ల 38, ఫిరంగిపురం 29, కారంపూడి 27, సత్తెనపల్లి 21, తెనాలి 20, చిలకలూరిపేట 20, నకరికల్లు 12, దుగ్గిరాల 10, బాపట్లలో 10 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 112 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కరోనా కారణంగా శుక్రవారం నాడు 9మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో 197మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది జులై, ఆగస్టు నెలల్లోనే మరణించారు. కరోనా నుంచి 12,477మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పరీక్షల సంఖ్యను పెంచారు. రోజూ 6వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 2లక్షల 27వేల మందికి పరీక్షలు నిర్వహించారు.