గుంటూరు జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 64.1 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి వినుకొండ సీతయ్యనగర్‌లో పెంకుటిల్లు కూలిపోయింది. రాజధాని గ్రామాల్లో గత రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద వాగు పొంగిపొర్లుతోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గుంటూరు జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు
గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లావ్యాప్తంగా 64.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అత్యధికంగా బాపట్లలో 157.2 మి.మీ. వర్షపాతం రికార్డు అయ్యింది.
గుంటూరు జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు
బాపట్లలో కుండపోత వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా బాపట్లలోనే 157.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు నగరంలోని మూడు వంతెనలు, పాత గుంటూరు శివారు ప్రాంతాలు వర్షానికి జలమయంగా మారాయి.