గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా నమోదైన కేసులతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 18వేల295 కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యాపరంగా చూస్తే గుంటూరు జిల్లా నాల్గో స్థానంలో ఉంది. ఆదివారం విడుదల చేసిన బులిటెన్లో 639 కొత్త కేసులు నమోదైనట్లు అదికారులు వెల్లడించగా... కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 254 కేసులు బయటపడ్డాయి.
వీటిలో ఐపీడీ కాలనీలో 26 కేసులు, నగరంపాలెంలో 32, పట్టాభిపురంలో 13, శ్రీనివాసరావుతోటలో 9 కేసులు చొప్పున నమోదు కాగా... నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ కేసులు తిష్టవేశాయి. జిల్లాలో మిగతా ప్రాంతాల్లోనూ వైరస్ వేగంగా విస్తరించింది. చిలకలూరిపేటలో 92 కేసులు, పిడుగురాళ్లలో 41 కేసులు, నరసరావుపేటలో 37, పొన్నూరులో 35, పెదకూరపాడులో 19, ఈపూరులో 22, మంగళగిరిలో 21, సత్తెనపల్లిలో 20, తెనాలిలో 16 కేసుల చొప్పున నమోదయ్యాయి.