గుంటూరు జిల్లాలో కొత్తగా 590 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 27 వేల 758కి చేరింది. కొత్త కేసుల్లో గుంటూరు నగరంలోనే 103 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. పెదకాకానిలో 76 కేసులు, మంగళగిరిలో 69, మాచర్లలో 57, నరసరావుపేటలో 43 కేసులు, తాడేపల్లి, తెనాలిలో 24 కేసుల చొప్పున, పొన్నూరులో 21, గుంటూరు గ్రామీణ మండలంలో 20 కేసులు, బాపట్లలో 19, పిడుగురాళ్లలో 18, చుండూరులో 15 కేసులు నిర్ధరణ అయ్యాయి.
కరోనా అప్డేట్: జిల్లాలో కొత్తగా 509 కేసులు, 6 మరణాలు - కరోనావైరస్
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 509 పాజిటివ్ కేసులు నిర్ధరణ కావటంతో... జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 27,758కు చేరింది. కొత్తగా జిల్లాలో ఆరుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు.

corona positive cases
జిల్లాలో కరోనాతో కొత్తగా ఆరుగురు చనిపోయారు. జిల్లాలో వ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 290కు చేరుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలున్న రెండో జిల్లాగా గుంటూరు కొనసాగుతోంది. కరోనా మరణాల్లో ఎక్కువమంది 60ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి 18వేల 109 మంది కోలుకున్నారు.
Last Updated : Aug 16, 2020, 9:32 PM IST