గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొన్నిరోజులుగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా జిల్లావ్యాప్తంగా 496 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలుపుకుంటే జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 63వేల 502కు చేరుకున్నాయి.
కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 76 కేసులున్నాయి. తర్వాత బాపట్లలో 40 కేసులు, నరసరావుపేట, రేపల్లెలో 26 కేసుల చొప్పున, తెనాలిలో 21, పొన్నూరు, కొల్లూరులో 18, సత్తెనపల్లిలో 15 కేసులు, తాడేపల్లి, వినుకొండలో 14 చొప్పున, నగరంలో 12, పెదకాకాని, శావల్యాపురంలో 11 కేసుల చొప్పున నిర్ధరణ అయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 57 వేల 925 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 584కి చేరింది. కరోనాతో అత్యధికంగా మృతిచెందిన వారి సంఖ్యలో గుంటూరు జిల్లా రెండో స్థానానికి చేరింది.