- 'ఇళ్ల పట్టాల పేరుతో రూ.6500 కోట్ల అవినీతి'
ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా ప్రభుత్వం.. రూ. 6 వేల 500 కోట్ల అవినీతికి పాల్పడిందని.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఇళ్ల స్థలాల్లో అక్రమాలు జరిగాయంటూ.. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో.. తెలుగుదేశం నేతలు ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- శ్రీవారి భక్తులపై లాఠీఛార్జి జరగలేదు: వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో శ్రీవారిమెట్టు వద్ద భక్తులపై లాఠీఛార్జి జరిగిందంటూ వస్తున్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నేతల గృహ నిర్బంధాలపై చంద్రబాబు ఆగ్రహం
తెదేపా నేతల అరెస్టులు, గృహ నిర్బంధంపై చంద్రబాబు మండిపడ్డారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైకాపా నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కని, పౌరుల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'కరోనా స్ట్రెయిన్ విషయంలో అప్రమత్తంగా ఉన్నాం'
కరోనా స్ట్రెయిన్ విషయంలో అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రైతుల ఉద్యమానికి మద్దతుగా హజారే ఆందోళన
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టనున్నట్టు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే దిల్లీలోని రామ్లీలా మైదానంలో రైతు దీక్షల్లో పాల్గొంటానని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మోదీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారు'