గుంటూరు జిల్లాలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 246 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల నమోదుతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేల 747కు చేరుకుంది. తాజాగా వెలుగు చూసిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 64 కేసులున్నాయి. తెనాలి-23, పెదకాకాని-14, మంగళగిరి-12, నరసరావుపేట-10, కేసులు చొప్పున బయటపడ్డాయి.
జిల్లాలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
గుంటూరు జిల్లాలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజా కేసుల నమోదుతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేల 747కు చేరుకుంది. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 576కి చేరింది.
జిల్లాలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 56 వేల 608 మంది ఇళ్లకు చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 576కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండీ... గుంటూరు జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు...నలుగురు మృతి