విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన యువతికి జీజీహెచ్‌లో శవపరీక్ష పూర్తయింది. మృతురాలి శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గొంతుకు లోతుగా కత్తి గాయం కావడం వల్లే మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. శవపరీక్ష తర్వాత యువతి మృతదేహాన్ని క్రీస్తురాజపురంలోని ఆమె నివాసానికి తరలించారు.
ప్రేమోన్మాది దాడి: యువతి శరీరంపై 13 కత్తిగాట్లు - young women killed in vijayawada news
విజయవాడలో ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన యువతికి శవపరీక్ష పూర్తయింది. మృతురాలి శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మరోవైపు యువతిపై కత్తితో దాడి చేసిన నాగేంద్ర బాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
vijaywada young women murder
మరోవైపు యువతిపై కత్తితో దాడి చేసిన నాగేంద్ర బాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. ప్రస్తుతం అతనికి బీపీ లెవల్స్ బాగా తగ్గినట్లు చెప్పారు. నాగేంద్ర బాబుకి మూడు చోట్ల కత్తి పోటు గాయాలు కావటంతో రక్తం బాగా పోయిందని చెప్పారు. అతనికి రక్తం ఎక్కిస్తున్నామని...కుటుంబసభ్యుల అనుమతి తీసుకుని సర్జరీ చేస్తామని చెప్పారు. సర్జరీ చేస్తేనే మిగిలిన విషయాలు చెప్పగలమని సూపరింటెండెంట్ ప్రభావతి వివరించారు.
ఇదీ చదవండి