పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైకాపా కార్పొరేటర్ హేమసుందరి భర్త భీమవరం సురేష్ హల్చల్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు సిబ్బందిపై ఆయన దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. భీమవరం సురేష్ ఇటీవల ఎస్‌కేడీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాడు. సురేష్ అలస్యంగా రావడంతో బస్సు వెళ్లిపోయింది. బస్సుని వెనక్కి రప్పించాలంటూ తన అనుచరులతో కలిసి ట్రావెల్స్ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. అక్కడున్న సిబ్బందిపై దాడి చేశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ట్రావెల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో సురేష్‌పై కేసు నమోదు అయింది. ఇప్పటికే సురేశ్‌పై రౌడీషీట్ కూడా ఉంది.
బస్సుని వెనక్కి రప్పిస్తారా..? లేదా..? వైకాపా కార్పొరేటర్ భర్త హల్చల్.. - undefined
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో.. వైకాపా కార్పొరేటర్ హేమసుందరి భర్త సురేశ్ హల్చల్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు సిబ్బందిపై దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. మూడు రోజుల క్రితం సురేశ్ ఎస్‌కేడీటీ ట్రావెల్ బస్సులో.. ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నారు. సురేశ్ ఆలస్యంగా రావడంతో బస్సు వెళ్లిపోయింది. బస్సును తిరిగి వెనక్కి రప్పించాలంటూ వీరంగం వేసిన సురేశ్.. ఓ దశలో ట్రావెల్స్ సిబ్బంది పై దాడికి దిగాడు.
వైకాపా కార్పొరేటర్ భర్త హల్చల్..
TAGGED:
దాడి