ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెళ్లింట విషాదం..మామిడి చెట్టు పైనుంచి పడి వధువు సోదరుడు మృతి - చెట్టుపై నుంచి పడి వధువు సోదరుడు మృతి

Young man died: సోదరి పెళ్లి.. ఇల్లంతా బంధువులతో సందడి.. అందరూ పనుల్లో మునిగిపోయారు.. అంతలో అమ్మ పిలిచింది.. ఏంటమ్మా అని దగ్గరికి వచ్చాడు కొడుకు.. తోరణాలు కట్టాలి.. ఆ మామిడి చెట్టు ఎక్కి ఆకులు తెంచుకురా అని చెప్పింది.. అలాగే అమ్మ అంటూ చెట్టు ఎక్కాడు.. చెట్టుపై నుంచి అందిరినీ చూస్తూ సంతోషంతో ఆకులు కోస్తున్నాడు.. ఇంతలో 'అమ్మా' అన్న అరుపుతో అందరూ ఉలిక్కిపడ్డారు.. సంతోషంగా ఉన్న ఇంట్లో విషాదం నెలకొంది.

Young man died
చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి

By

Published : May 13, 2022, 12:57 PM IST

Updated : May 13, 2022, 2:41 PM IST

పెళ్లింట విషాదం నెలకొంది. సోదరి పెళ్లిలో తోరణాల కోసం మామిడి ఆకులు కోస్తూ.. చెట్టుపై నుంచి సోదరుడు కిందపడ్డాడు. యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణంతో ఈ ఇల్లు చావు కేకలతో మార్మోగింది. పెళ్లితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికి వచ్చిన బంధువుల కళ్లన్నీ కన్నీటితో నిండిపోయాయి. ఈ విషాదకర ఘటనలో ఏలూరు జిల్లాలో జరిగింది.

ఏలూరు జిల్లా కైకలూరు మండలం గోపవరంలో చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. సోదరి పెళ్లి కోసం మామిడి చెట్టు ఎక్కి ఆకులు కోస్తుండగా కాలు జారి కిందపడటంతో తల వెనుక భాగంలో బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిలకాబత్తిన సాయి మృతి చెందాడు. ఈ ఘటనతో ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు... కైకలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : May 13, 2022, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details