ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జోహార్ ఎన్టీఆర్.. సారీ జోహార్ వైఎస్సార్ - moshenu raju

వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేనురాజు తన ప్రసంగంలో తడబడ్డారు. పార్టీ సమావేశంలో జోహార్ ఎన్టీఆర్ అంటూ మూడుసార్లు నినాాదాలు చేసి కార్యకర్తలను ఆశ్చర్యపరిచారు. అనంతరం క్షమాపణలు చెప్పి జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలు చేశారు.

కొయ్యే మోషేనురాజు

By

Published : Jun 24, 2019, 3:52 AM IST

తడబడిన వైకాపా నేత
పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా విజయోత్సవ అభినందన సభలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేనురాజు టంగ్ స్లిప్ అయ్యారు. తన ప్రసంగం అనంతరం జోహార్ వైస్సార్ అనడం మరచి జోహార్ ఎన్టీఆర్ అంటూ మూడు సార్లు నినాదాలు చేశారు. ఈ పరిణామంతో సభకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న మోషేనురాజు క్షమించాలి, క్షమించాలి అంటూ జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలు చేశారు. వెంటనే విజయోత్సవ సభలో నవ్వులు మిన్నంటాయి. ఇటీవల మోషేనురాజు కుమారుడు వివాహానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు అయినా వారిని మరిచి జోహార్ ఎన్టీఆర్ అనడం ఏంటని కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మోషేనురాజు మాటలను నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణమరాజు సమర్థించారు. మోషేనురాజు జోహార్ ఎన్టీఆర్ అనడం సమంజసమేనని... రాష్ట్రానికి ఎన్నో మంచి పనులు చేసిన మహానీయుడిని స్మరిస్తే తప్పు లేదని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్​లు ఆంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్​ను తాను కూడా స్మరిస్తానని అన్నారు. ఎంపీ మాటలతో సభలో మరోసారి నవ్వులు పూశాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details