రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులకు సైతం సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైకాపా నాయకులతో కలసి ఆమె అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులు అర్పించారు.