పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మాదివాడలో ఇంటిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కోడలి కుటుంబ సభ్యులతో మనస్పర్థల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు నలుగురు కారణమంటూ నాగమణి అనే మహిళ ఫోన్‌లో ఆడియో రికార్డు చేసింది.
Woman Suicide : "నా చావుకు కారణం వాళ్లే.." ఫోన్‌లో రికార్డు చేసి మరీ దారుణం..! - పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళ ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఆకివీడు మాదివాడలో ఇంటి పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్‌లో రికార్డు చేసి మరీ దారుణానికి పాల్పడింది.
ఫోన్‌లో ఆడియో రికార్డు చేసి...ఆపై మహిళ ఆత్మహత్య
అనంతరం ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : Sexual assualt: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం