గుర్తు తెలియని ఆగంతకులు ఓ యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో జరిగింది. పోతవరంలో నిట్ విద్యార్థి కొనకళ్ల వంశీ (21) కిడ్నాప్, హత్య గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసింది.
బాదంపూడికి చెందిన కొనకళ్ల శ్రీను.. పోతవరం గ్రామంలో చికెన్ షాప్ నడుపుతూ స్థిరపడ్డాడు. అతనికి ఇద్దరు కుమారులు. చిన్నవాడు వంశీ.. కలకత్తాలోని నిట్లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో తండ్రి వద్ద ఉంటున్నాడు.
మంగళవారం రాత్రి షాప్ మూసిన తర్వాత తండ్రికి చెప్పి బయటికి వెళ్లాడు. గంట తర్వాత తండ్రి.. శ్రీనుకి ఫోన్ చేయగా గుర్తుతెలియని అగంతకులు ఫోన్ లిఫ్ట్ చేసి 'మీ కుమారుడు మా వద్దనే ఉన్నాడు రూ.50 లక్షలు కావాలి' అని డిమాండ్ చేశారు. నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిలో డబ్బులు పెట్టి వెళ్లి పోవాలని కిడ్నాపర్లు చెప్పారు. దీంతో కంగారుపడిన తండ్రి బంధువులను వెంట తీసుకుని నల్లజర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం వివరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.