రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 2.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా జల గణన డాటా కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని... పశ్చిమగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాలకు ఉచిత బోర్ల ద్వారా నీటిని అందించే కార్యక్రమానికి ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని తెలిపారు. వరి, ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.