- నిలకడగా...
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,506 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బాధితులుగా ఉన్న వారిలో.. 16 మంది మరణించారు. మరోవైపు.. 1,835 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బాధిత కుటుంబీకులను ఆదుకుంటాం'
గుంటూరు నగరంలో పట్టపగలే దారుణ హత్య (Murder in Guntur)కు గురైన రమ్య మృతదేహాన్ని హోం మంత్రి (Home Minister Sucharitha) పరిశీలించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబీకులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సబ్ లీజుల పేరుతో ఇసుక దోపిడీ'
లెక్కల్లో తేడాలు రావడం వల్లే మంత్రి వెల్లంపల్లి చేస్తున్న ఇసుక దోపిడీ వ్యవహారం బయటకొచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం ఆరోపించారు. సబ్ లీజుల మాటున జరుగుతున్న వ్యవహారానికి ప్రకాశ్ పవర్ సంస్థ ఉద్యోగి ఫిర్యాదే నిదర్శనమన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'వారిని ఉరి తీయాలి'
వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను ఉరి తీయాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపైనా కూడా కొందరు ఆరోపణలు చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేయాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మార్పులివే!
భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 74 ఏళ్లు గడిచాయి. సగర్వంగా నేడు 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అనేక అనుభవాలు.. ఆటుపోట్లు. అనేక మార్పులు. ఆకలి నుంచి మిగులు ఆహార ధాన్యాల నిల్వల వరకు.. ఆర్థిక సంక్షోభం నుంచి.. ఆర్థిక స్వాతంత్ర్యం వరకు.. ఇలా చాలా విప్లవాత్మక మార్పులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నాణేలతో రికార్డు