- కడపలో సీఎం పర్యటన
కడప జిల్లాలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో పులివెందుల, బద్వేలు ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'జోక్యం చేసుకోండి'
కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్షం సమావేశమయ్యింది. సీఎం జగన్ ఉత్తరాలు రాస్తున్నారే తప్ప.. రైతులు నష్టపోతున్నారని ఆలోచించటం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాలను సాధించేందుకు.. కార్యాచరణ ప్రకటిస్తే సీఎం వెనకుండి నడుస్తామని నేతలు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దశాబ్దం తర్వాత క్రాప్ హాలీడే
కోనసీమలో దశాబ్ద కాలం తర్వాత మళ్లీ క్రాప్ హాలిడే మాట వినిపిస్తోంది. 2011లో పంట విరామం ప్రకటించిన రైతులు.. ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నారు. డ్రైయిన్‌లు పూడుకపోవడం.. వరుస విపత్తులు, ముంపు బెడదతో పంటలు నష్టపోవడం పరిపాటిగా మారడంతో.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తెలంగాణ హైకోర్టులో విచారణ
కృష్ణానది జలవిద్యుత్ ఉత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభమైంది. ఇరువైపులా న్యాయవాదులు గందరగోళం సృష్టిస్తున్నారని సీజే జస్టిస్ హిమాకోహ్లి అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎల్లుండి ముహూర్తం.. !
కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో 22 మంది వరకు కొత్తవారికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. అదే సమయంలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొత్త గవర్నర్లు