ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వింతవ్యాధికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు: ఎంపీ గల్లా - ఏలూరు వింత వ్యాధిపై గల్లా కామెంట్స్

ఏలూరు వింత వ్యాధి అంశాన్ని లోక్​సభలో ప్రస్తావించారు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్. ఇప్పటికీ కారణాలను తెలపలేదన్నారు. ఆ దిశగా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp mp galla jayadev
tdp mp galla jayadev

By

Published : Mar 17, 2021, 8:27 PM IST

ఎంపీ గల్లా జయదేవ్

ఏలూరు వింత వ్యాధి అంశాన్ని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్​సభలో ప్రస్తావించారు. కొన్ని నెలల క్రితం ప్రబలిన వింతవ్యాధికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

'ఏలూరులో ఓ వింతవ్యాధి తీవ్ర కలకలం సృష్టించింది. దాదాపు 700 మంది మూర్ఛ, కళ్లు తిరగడం, వాంతులు సహా అనేక ఇతర లక్షణాలతో బాధపడ్డారు. చాలా మంది స్పృహ కోల్పోయారు. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్‌, కేంద్ర బృందాలు అనారోగ్యానికి కారణాలు తెలుసుకోవడానికి ఏలూరులో పర్యటించాయి. ఇప్పటికీ కారణాలు తెలియరాలేదు. కేంద్రమంత్రి జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను'- లోక్​సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్

ABOUT THE AUTHOR

...view details