ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరులో వింత వ్యాధి తగ్గుముఖం.. రాత్రి నుంచి ఒకే ఒక్క కేసు నమోదు - ఏలూరులో వింత వ్యాధి న్యూస్

ఏలూరులో రాత్రి నుంచి ఇప్పటివరకు ఒక కేసు మాత్రమే నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వింత వ్యాధి బాధిత కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 605 గా నమోదైంది. సాయంత్రం వింత వ్యాధిపై నిపుణలు కమిటీ నివేదికను అందించనుంది.

Strange disease
Strange disease

By

Published : Dec 11, 2020, 11:28 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్యాధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి ఇప్పటివరకు ఒక కేసు మాత్రమే నమోదైనట్లు వెల్లడించారు. అంతుచిక్కని వ్యాధి బాధితుల సంఖ్య 605కు చేరింది. ఇప్పటివరకు 536 మంది డిశ్చార్జి అయ్యారు. ఏలూరు ఆస్పత్రిలో 35 మంది, విజయవాడ ఆస్పత్రిలో 34 మంది చికిత్స పొందుతున్నారు. సాయంత్రం నివేదిక అందించనున్న నిపుణుల కమిటీ సీసం, నికెల్, ఆర్గానో క్లోరిన్, క్రిమిసంహారక అవశేషాలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details