ఏలూరులో వింత మూర్ఛ వ్యాధి క్రమేణా తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరిండెంట్ ఎవీఆర్ మోహన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 77 మంది మాత్రమే చికిత్స పొందుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఈ రోగానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పంటలపై పిచికారి చేస్తున్న పురుగుమందులు, కూరగాయలు, పళ్లు తాజాగా ఉంచడానికి వినియోగిస్తున్న రసాయనాలపై దృష్టి పెట్టామని.. వీటి వివరాలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి పంపించినట్టు ఆయన తెలిపారు. ఈ వింత వ్యాధికి సంబంధించి రోగుల సంఖ్య క్రమేణా తగ్గుతున్నప్పటికీ.. చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రి సిద్ధంగా ఉందని వెల్లడించారు. తిరుపతి స్విమ్స్ నుంచి న్యూరాలజిస్టులను పిలిపించినట్టు వెల్లడించారు.
'ఏలూరులో వింత వ్యాధి క్రమేణా తగ్గుముఖం పడుతోంది' - Eluru Latest News
ఏలూరులో వింత మూర్ఛ వ్యాధి క్రమేణా తగ్గుముఖం పడుతోందని... ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరిండెంట్ ఎవీఆర్ మోహన్ వివరించారు. ఈ వింత వ్యాధికి సంబంధించి రోగుల సంఖ్య క్రమేణా తగ్గుతున్నప్పటికీ.. చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
'ఏలూరులో వింత వ్యాధి క్రమేణా తగ్గుముఖం పడుతోంది'