ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి' - జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వార్తలు

వృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని... సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ సమాఖ్య రాష్ట్రస్థాయి ద్వితీయ వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. విశ్రాంత జీవితాన్ని హాయిగా ఎలా గడపాలనే విషయంపై సీనియర్ సిటిజన్స్​కు ఆయన సలహాలిచ్చారు

jasti chelameswar
jasti chelameswar

By

Published : Feb 16, 2020, 10:32 PM IST

జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రసంగం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ సమాఖ్య రాష్ట్రస్థాయి ద్వితీయ వార్షిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో అక్కడక్కడా వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గతంలో ఉన్న పరిస్థితులను కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్రాంత జీవితాన్ని సంతోషంగా గడపాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సంతోషం కలిగించే వ్యాపకాలను పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చలమేశ్వర్ కొంతమంది సీనియర్ సిటిజన్స్​ను సత్కరించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details