తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సోనూ సూద్ ఫోన్ చేశారు(Sonu Sood Phone call to Chandrababu news). చంద్రబాబును పరామర్శించారు. శాసన సభలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబుతో చెప్పారు.
Sonu Sood Phone call to Chandrababu: శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరం: సోనూ సూద్ - చంద్రబాబుకు సినీ నటుడు సోనూ సూద్ ఫోన్ తాజా వార్తలు
![Sonu Sood Phone call to Chandrababu: శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరం: సోనూ సూద్ sonusood phone call to tdp chief chandrababu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13697095-162-13697095-1637498451219.jpg)
18:09 November 21
చంద్రబాబుకు సినీ నటుడు సోనూ సూద్ ఫోన్
ఉదయం రజనీకాంత్ ఫోన్..
ఇవాళ ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును ఫోన్లో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని.. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Floods in AP: ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కర్లేదు - సీఎం జగన్