వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా...? లేక వైకాపా ఎమర్జెన్సీ ప్రవేశపెట్టిందా..? అన్నట్లు ఉందని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పర్యటనలో మాట్లాడిన ఆయన.. అధికార యంత్రాంగం అధికార పార్టీ వైపు ఉండడం చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు. దశావతారాలు ఎంచుకుని ఎన్నికల్లో అభ్యర్థులను తప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. అభ్యర్థులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఎక్సైజ్, రౌడీషీట్ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. నిజంగా ప్రజాదరణే ఉంటే ఎలక్షన్లకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు వేయకపోతే రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ పథకాలను తొలగిస్తామని భయపెడుతున్నారు అని అన్నారు. వీటన్నింటిపై దిల్లీ వెళ్లి ఏపీలోని పరిస్థితిపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
'ఎన్నికలు జరుగుతున్నాయా..? లేక వైకాపా ఎమర్జెన్సీ ప్రవేశపెట్టిందా..?' - సోము వీర్రాజు తాజా వార్తలు
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలకు దిగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అట్రాసిటీతో పాటు పలు కేసుల పేరుతో ప్రతిపక్షాల అభ్యర్థులను బెదిరిస్తున్నారని... ప్రస్తుత పరిస్థితి చూస్తే... ఎన్నికలు జరుగుతున్నాయా..? లేక రాష్ట్రంలో వైకాపా ఎమర్జెన్సీ ప్రవేశపెట్టిందా..? అన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
somu veerraju fiers on ycp govt