ప్రజలు ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏలూరు నగరపాలక సంస్థ యంత్రాంగం పారిశుద్ధ్య పరిస్థితి మెరుగునకు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. జంతు కళేబరాలు, చెత్తాచెదారంతో నిండిన మురుగు కాలువలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. పందుల్ని పట్టించి నగరానికి దూరంగా తరలించాల్సి ఉండగా చర్యలు చేపట్టలేదు.
‘నాలుగు రోజులుగా తాగునీరు కొంచెం తేడాగా ఉంది. వాల్వులు, పైపులైన్లలో మురుగునీరు చేరి కలుషితమవుతోంది’ అని రాంబాబు తెలిపారు.