ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేటలో వాన కురవటం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. వరిపంట కోతకు వచ్చిన సమయంలో వర్షంతో నష్టం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం
ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అంబాజిపేటలో వాన కురవటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వరిపంట కోతకు వచ్చిన సమయంలో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. తణుకు, ఉండ్రాజవరంలో ఉరుములతో వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడం వల్ల ప్రజలు ఉపశమనం పొందారు.
rain-in-godavari-district
కోనసీమలో చల్లని వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పులు కారణంగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉక్కబోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడడం వల్ల ఉపశమనం పొందారు. వరికోతకు సమయం దగ్గర పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి:34 కొత్త కేసులు.. ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్