ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Police Cardan Search : ప్రకాశం జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్... పలు వాహనాలు స్వాధీనం - Police Cardan Search in Prakasham district

Police Cardan Search : ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు.

Police Cardan Search
ప్రకాశం జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్

By

Published : Jan 2, 2022, 1:50 PM IST

Updated : Jan 2, 2022, 5:00 PM IST

Police Cardan Search In Prakasham district: ప్రకాశం జిల్లా , గిద్దలూరు, కంభం పట్టణాల్లోని అర్బన్ కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలను ఒక ఆటో ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి అరికట్టే ఉద్దేశంతో ఎస్పి ఆదేశాల మేరకు ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

Police Cardon Search : ప్రకాశం జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. అద్దంకిలోని ఎన్టీఆర్ కాలనీలో జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్, ఆటో స్వాధీనపరచుకొని విచారణ చేపట్టారు. కొత్త వ్యక్తుల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చీరాలలోని ఆదినారాయణపురం తనిఖీల్లో 8 ద్విచక్రవాహనాలు, 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. వేటపాలెం తనిఖీల్లో 10 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. రామ్ నగర్​లో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని సాయినగర్​లో చేపట్టిన కార్టెన్ సెర్చ్​లో ముగ్గురు అనుమానితులను, పత్రాలులేని 23 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి : THEFT VIRAL VIDEO: ఏమీ దొరక్క.. టిషర్ట్‌తోపాటు ద్విచక్రవాహనం ఎత్తుకెళ్లిన దొంగ

Last Updated : Jan 2, 2022, 5:00 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details