ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరును వీడని కలవరం...585కు చేరిన బాధితులు - ఏలూరులో వింత వ్యాధి వార్తలు

అంతు చిక్కని వ్యాధితో ఏలూరు సతమతమవుతోంది. తాజాగా మరికొంతమంది ఈ వ్యాధి బారిన పడటంతో... మొత్తం బాధితుల సంఖ్య 585కు చేరింది. అయితే కొత్త కేసుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పడుతోందని అధికారులు వెల్లడించారు. ప్రజల అస్వస్థతకు కారణాలపై వివిధ సంస్థలు పరిశోధిస్తున్నాయి.

eluru
eluru

By

Published : Dec 9, 2020, 4:25 PM IST

Updated : Dec 9, 2020, 8:33 PM IST

ఏలూరును వీడని కలవరం...585కు చేరిన బాధితులు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి లక్షణాలతో బుధవారం మరో 20 మంది బాధితులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరితో సహా మొత్తం బాధితుల సంఖ్య(బుధవారం మధ్యాహ్నం నాటికి) 585కు చేరింది. వీరిలో 510 మంది డిశ్ఛార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో 58 మంది ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి గుంటూరు, విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే బాధితుల సంఖ్య క్రమేణా తగ్గుతోందని ప్రభుత్వం తెలియజేసింది.

మరోవైపు రోగ కారణాలు తెలుసుకునేందుకు జాతీయ పరిశోధనా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. డబ్ల్యూహెచ్​వో, ఎన్​ఐఎన్, ఐసీఎంఆర్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసన్‌ తదితర బృందాలు నీరు, పాలు, కూరగాయల నమూనాలు సేకరిస్తున్నాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎయిమ్స్ వైద్యులు బుధవారం పరీక్షించారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్​ బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగుల శరీరంలో సీసం, నికెల్‌ అవశేషాలున్నట్లుగా మొదటి నివేదికలో తేల్చిన ఎయిమ్స్... రెండో నివేదికను ఇవాళ వెల్లడించే అవకాశముంది. సీసీఎంబీ నివేదిక సైతం రావాల్సి ఉంది.

Last Updated : Dec 9, 2020, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details