Tammileru: ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే నుంచి పెదవేగి మండలం విజయరాయి వెళ్లాలంటే తమ్మిలేరు దాటాల్సిందే. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఏడాది పొడవునా నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. బలివేలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత చదువుల కోసం విజయరాయి వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లల కోసం తల్లిదండ్రులు ఏటిగట్లపై పడిగాపులు కాసి దగ్గరుండి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మరోవైపు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బలివేలోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానానికి నిత్యం భక్తులు వస్తుంటారు. ఇక్కడ వంతెన నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రెండు మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా శివరాత్రికి తాత్కాలికంగా తూరలు పెట్టి మట్టికట్ట వేస్తున్నా కొట్టుకుపోతోంది. ప్రత్యామ్నాయంగా ఉన్న వలసపల్లి వంతెనపై నుంచి వెళ్లాలంటే ఒకవైపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.
Tammileru: తమ్మిలేరు... వంతెన కట్టేవారు లేరు - తమ్మిలేరు వంతెన వార్తలు
Tammileru: సాధారణంగా పల్లెల్లో వర్షకాలం నీటిలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ మాత్రం ఏడాది పొడవునా నీటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. పిల్లు పాఠశాలలకు వెళ్లాలన్నా, పెద్దలు పొరుగూరు వెళ్లాలన్నా ఆ నీటిని దాటుకునే వెళ్లాలి. అధికారులెవరైనా స్పందించి వంతెన నిర్మిస్తారేమోనని అక్కడి ప్రజల ఆశలు... నిరాశలుగానే మిగులుతున్నాయి. ఇంతకీ ఇది ఎక్కడంటే..?
తమ్మిలేరు