పేగు బంధం కూడా మార్కెట్ సరకవుతోంది. కన్నబిడ్డను అమ్మేసి, వచ్చిన డబ్బును పంచుకుని, తమ బంధాన్ని తెంచుకుందామనుకున్న ఓ జంట తీరు నివ్వెర పరిచింది. ఇవీ వివరాలు... రాజమహేంద్రవరానికి చెందిన రారాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను వారిని వదిలేసి ఒంటరిగా ఉంటూ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కాకినాడకు చెందిన కె.వసంతకు గతంలో బాల్య వివాహమై, రద్దయింది. ప్రస్తుతం మేజర్ అయిన ఆమె రాజమహేంద్రవరంలోని ఒక బైక్ షోరూంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వసంతను రారాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. నెల రోజులుగా రారాజు... తన తండ్రి ప్రసాద్, వసంతలతో కలిసి ద్వారకా తిరుమలలో ఉంటున్నాడు. అయితే జంట మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కుమారుడిని విక్రయించి, వచ్చిన డబ్బును పంచుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
"బిడ్డను అమ్మేసి... సొమ్ము పంచుకుని విడిపోదాం" - బిడ్డను విక్రయించేందుకు యత్నించిన తల్లిందండ్రులు
ఈ ప్రపంచంలో తల్లిదండ్రులం కాలేకపోతున్నామని బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. తాము పస్తులుండి పిల్లలను పోషించుకునే వారూ ఉన్నారు. అమ్మ, నాన్న అని పిలుపించుకునే వరం కావాలని చెట్టు, పుట్టా తిరుగుతూ ఆరాటపడేవారు ఇంకెందరో. కానీ కొందరికి ఆ వరం లభించినా డబ్బుకు ఆశపడి బిడ్డలను అంగట్లో అమ్మకానికి పెట్టి అమానవీయతను చాటుతున్నారు. అమ్మ, నాన్న అనే పదాలకే మాయని మచ్చగా నిలుస్తున్నారు. తాజాగా ఓ జంట ఇలాగే చేసింది. పేగు బంధం కూడా మార్కెట్ సరకుగా మార్చారు. కన్నబిడ్డను అమ్మేసి, వచ్చిన డబ్బును పంచుకుని, తమ బంధాన్ని తెంచుకుందామనుకున్నారు. అసలేం జరిగిందంటే..?
భీమవరానికి చెందిన ఒక వ్యక్తికి చిన్నారిని అమ్మేందుకు బేరం పెట్టారు. ఈ మేరకు గురువారం రారాజు, వసంత, ప్రసాద్‌లు ద్వారకా తిరుమల కొండపైనున్న ఒక కాటేజీ వద్దకు వెళ్లారు. భీమవరం వాసి కూడా అక్కడికి చేరుకున్నారు. రూ.2 లక్షలకు ఇచ్చేద్దామని రారాజు, రూ.10 లక్షలకు ఇద్దామని ప్రసాద్ గొడవ పడ్డారు. విషయం తెలుసుకున్న భక్తులు, ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భీమవరం వాసి పరారయ్యారు. పోలీసులు చేరుకుని చిన్నారితోపాటు రారాజు, వసంత, ప్రసాద్‌లను ఠాణాకు తరలించారు.
ఇవీ చదవండి: