No people in rythu bharosa program: ఏలూరు జిల్లా గణపవరంలో 4వ విడత రైతు భరోసా నగదు బదిలీ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. సభలో సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే మహిళలు సభ నుంచి వెళ్లిపోయారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం మధ్యలోనే సభ వెనుక ఉన్న మహిళలు.. సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. భారీ స్థాయిలో మహిళలు వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం బోసిపోయింది. సభ నుంచి వెళ్తున్న మహిళలను ఆపడానికి వాలంటీర్లు, పోలీసులు ప్రయత్నించారు. అయినా మహిళలు బలవంతంగా వెళ్లిపోయారు. బలవంతంగా సభకు తీసుకెళ్లారని.. తాము వెళ్లిపోతామని పలువురు మహిళలు తెలిపారు. ఎండలు అధికంగా ఉండటంతో సభ ప్రాంగణంలో మహిళలు కూర్చోలేకపోయారు.
No people: సీఎం ప్రసంగిస్తుండగానే... సభ నుంచి వెళ్లిపోయిన మహిళలు - సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన మహిళలు
No people in rythu bharosa program: సీఎం సభ నుంచి మహిళలు వెళ్లిపోయారు. గణపవరంలో రైతు భరోసా నాలుగో విడత సభలో సీఎం ప్రసంగిస్తుండగానే చాలామంది మహిళలు సభ నుంచి వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు వాలంటీర్లు, పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అధిక సంఖ్యలో మహిళలు వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం బోసిపోయింది.
సీఎం సభలో మధ్యలో వెళ్లిపోయిన మహిళలు