మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ సభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన లోకేశ్.. రాంజీ త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.
చింతలపూడి నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ కర్రా రాజారావు మృతి పట్ల లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తలకు అండగా నిలిచిన కర్రా రాజారావు మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.