పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సందర్శించారు. అంతు చిక్కని సమస్యతో అస్వస్థతకు గురైన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హడావిడిగా బాధితులను డిశ్చార్జ్ చేయటం సరికాదన్నారు. తాగునీరు కలుషితం కాలేదని మంత్రి చెప్పడం హాస్యాస్పదమన్న లోకేశ్... ప్రజలను మభ్యపెట్టడానికే ఇలాంటి ప్రకటనలని చెప్పారు. మంత్రి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టకపోవడమే సమస్యకు కారణమన్నారు.