అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వ్యాధి తీవ్రత అంత ప్రమాదకరంగా ఏమీ లేదని.. బాధితులు బయపడాల్సిన అవసరం లేదని వారు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో విజయవంతమయ్యారని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు చేశారన్నారు. సమస్యకు సంబంధించిన కారణాలు త్వరలోనే తెలుస్తాయన్నారు.
ఏలూరు బాధితులను పరామర్శించిన ఎంపీ కోటగిరి - ఏలూరు బాధితుల తాజా వార్తలు
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు.
ఏలూరు బాధితులను పరామర్శించిన ఎంపీ కోటగిరి