ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vishwaroop: "జూన్ మొదటి వారంలోనే.. గోదావరి డె‌ల్టాకు సాగునీరు"

Minister Vishwaroop: జూన్ మొదటి వారంలోనే గోదావరి డె‌ల్టాకు సాగునీరు విడుదల చేయనున్నట్లు మంత్రి పినపే విశ్వరూప్ తెలిపారు. తుపాన్‌ల నుంచి పంటను కాపాడుకునేందుకు ముందే నీటిని విడుదల చేస్తామన్నారు. ఈలోగా గోదావరి డెల్టాలో కాలువల మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారంలో ధాన్యం బకాయిలు సైతం చెల్లిస్తామని మంత్రి విశ్వరూప్‌ చెప్పారు.

Minister Vishwaroop
గోదావరి డె‌ల్టాకు సాగునీరు

By

Published : May 21, 2022, 7:17 AM IST

Minister Vishwaroop: జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత నివారణకు చర్యలు తీసుకున్నట్లు ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా నీటి పారుదల, వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తుపాన్‌ల నుంచి పంటను కాపాడుకునేందుకు ముందే నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. అన్ని ప్రాజెక్టుల్లో నీటి లభ్యత బాగుందని పేర్కొన్నారు. పశ్చిమ డెల్టాలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఏలూరు జిల్లాకు ఓ అండ్‌ ఎం కింద రావాల్సిన రూ.10 కోట్ల నిధుల విడుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలను సంప్రదించి ఏలూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ను త్వరలో ఎన్నుకుంటామన్నారు. జూన్ మొదటి వారంలో ధాన్యం బకాయిలు సైతం చెల్లిస్తామని మంత్రి విశ్వరూప్‌ చెప్పారు.

గోదావరి డె‌ల్టాకు సాగునీరు

ABOUT THE AUTHOR

...view details