అక్రమాలకు పాల్పడితే పార్టీలో ఏ స్థాయి నాయకుడినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పౌరసంబంధాలు, రవాణా శాఖమంత్రి పేర్ని నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇళ్ల స్థలాల పంపిణీపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనిత, జిల్లా ఎమ్యెల్యేలు పాల్గొన్నారు.
వారిని పార్టీ నుంచి తొలగిస్తాం: మంత్రి పేర్ని నాని - minister perni nani on housing irregularities
ఇళ్ల స్థలాల పంపిణీలో మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై మంత్రి పేర్నినేని స్పందించారు. అక్రమాలకు పాల్పడ్డారని తెలిస్తే సొంత పార్టీవారైనా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో ఏ స్థాయి వ్యక్తులైనా క్షమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రి పేర్ని నాని ఏలూరులో సమీక్ష నిర్వహించారు.
మంత్రి పేర్ని నాని
జిల్లాలో ఇళ్ల స్థలాల కేటాయింపులపై వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీవారైనా ఉపేక్షించేది లేదని, క్షమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటి స్థలాల పంపిణీలో మామూళ్లు వసూలు చేసే వారిని పార్టీ నుంచి తొలగించేందుకు సైతం వెనకాడబోమని మంత్రి తెలియజేశారు. పాలకొల్లుకు చెందిన ఓ నేతపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇదీ చదవండి :సర్వేయర్‌పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..?