ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఆళ్లనాని - వింత వ్యాధి బాధితులకు మంత్రి ఆళ్ల నాని పరామర్శ

అంతు చిక్కని అనారోగ్యంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

mysterious illness
mysterious illness

By

Published : Dec 8, 2020, 4:25 PM IST

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సందర్శించారు. అంతు చిక్కని సమస్యతో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. ఆస్పత్రి పర్యవేక్షకులతో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు.

బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, కలెక్టర్ ముత్యాలరాజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యవసర గదిని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details