ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

WONDER: భూమి మీద నూకలున్నాయి.. రైలుకింద పడినా బతికిపోయాడు - a man falls under train

భూమి మీద నూకలున్నాయంటే ఇదేనేమో! ఏకంగా రైలు కింద పడిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మద్యం మత్తులో పట్టాలపై నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. అప్పడే వస్తున్న రైలు అతన్ని సమీపించింది. డ్రైవర్ అప్రమత్తతో బతుకు జీవుడా అంటూ బతికి బట్ట కట్టాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైల్వే స్టేషన్​లో జరిగింది.

man falls under train
man falls under train

By

Published : Aug 2, 2021, 7:38 PM IST

రైలుకింద పడినా బతికిపోయాడు..

ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టినా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైల్వే స్టేషన్​ సమీపంలో జరిగింది. తణుకు-మండపాక గ్రామాల మధ్య రైలు పట్టాలపై వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తుండగా తణుకు రైల్వే స్టేషన్ నుంచి అప్పుడే బయల్దేరిన సర్కార్ ఎక్స్​ప్రెస్​ వెనకనుంచి వచ్చి ఢీ కొట్టింది. ట్రైన్​ వేగం తక్కువ ఉండటంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.

వ్యక్తిని ఢీ కొట్టిన విషయం గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రైలును ఆపేశాడు. రైలు బండి కింద పట్టాల మీద పడి ఉన్న వ్యక్తిని స్థానికుల సహకారంతో బయటికి తీశారు. స్వల్ప గాయాలైన బాధితుడిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన రైలు డ్రైవర్​ను పలువురు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details