తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు రెండో కుమారుడు బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కోకాపేటలో నివసించే మాగంటి కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ మే 28న బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో దిగారు. ఆయనకు లివర్ సిరోసిస్ సమస్య ఉండటంతో చికిత్స పొందాడానికి నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హోటల్ గది ఖాళీ చేయాల్సి ఉండగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలవుతున్నా బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది గుర్తు చేయడానికి వెళ్తే.... ఎంతకూ తలుపులు తీయలేదు. దీంతో హోటల్ మేనేజర్ మరో తాళం చెవితో తలుపులు తెరిచి చూస్తే.... రవీంద్ర స్నానాల గదిలో పడిపోయి నిర్జీవంగా కనిపించారు. అతని నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. బంజారాహిల్స్ పోలీసులు వివరాలు సేకరించి.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మాగంటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రక్తపు వాంతుల కారణంగానే రవీంద్ర మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది నెలల కిందటే మాగంటి వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు రాంజీ మరణించారు.
మాగంటి బాబు రెండో కుమారుడు అనుమానాస్పద మృతి - maganti babu son suspicious died
మాగంటి బాబు రెండో కుమారుడి అనుమానాస్పద మృతి
22:08 June 01
చంద్రబాబు సంతాపం
రవీంద్ర మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేలా కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని, రవీంద్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దగ్గులూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన
Last Updated : Jun 2, 2021, 9:10 AM IST