తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గుడాాటిపల్లి భూనిర్వాసితులు మధ్యాహ్నం నుంచి నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో తెరాస ప్రజాప్రతినిధులు, భూనిర్వాసితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
TS News: ప్రజాప్రతినిధులపై భూనిర్వాసితుల దాడి.. పోలీసుల లాఠీఛార్జ్ - Land expatriates protest
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుడాాటిపల్లి భూనిర్వాసితులు ప్రజాప్రతినిధులపై దాడికి దిగారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలపై భూనిర్వాసితులు దాడికి దిగారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్‌పైనా భూ నిర్వాసితులు దాడి చేశారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పునరావాసం ప్యాకేజీ కొన్నాళ్లుగా గూడాటిపల్లి వాసులు ఆందోళన చేపట్టారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములను గుడాటిపల్లి వాసులు కోల్పోయారు. ప్యాకేజీ ఇవ్వకుండా ట్రయల్‌రన్ నిర్వహించవద్దని ఆందోళన చేపట్టారు. పోలీసులు, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది.
ఇదీ చదవండి :
TAGGED:
Land expatriates protest