Enquiry: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస మరణాలపై అధికారులు సోమవారం రహస్యంగా విచారణ చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించేందుకు వస్తున్న నేపథ్యంలో వారిని ఉదయాన్నే ఏలూరు తీసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 12 కుటుంబాల నుంచి పలువురు సభ్యులను జంగారెడ్డిగూడెం నుంచి నుంచి తీసుకొచ్చి ఏలూరులోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ పి.పద్మావతి, మరి కొంతమంది అధికారులు వారి నుంచి వివరాలు సేకరించారు.
కల్తీసారా మృతుల కుటుంబాలతో పూర్తైన రహస్య విచారణ! - ఎంపీడీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ పద్మావతి విచారణ
Enquiry: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మృతుల కుటుంబాల నుంచి జాయింట్ కలెక్టర్ పద్మావతి వివరాలు సేకరించారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వారితో మాట్లాడారు. పాత్రికేయులెవరినీ అనుమతించలేదు. బాధిత కుటుంబాలకు మధ్యాహ్నం భోజనాలను లోపలే ఏర్పాటు చేయడం గమనార్హం. మధ్యలో కొందరు సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి వెళ్లారు. విచారణలో దాదాపు అందరూ ఒకే విధమైన సమాధానం ఇచ్చారని తెలిసింది. ‘మీ వాళ్లు మృతి చెందడానికి కారణం ఏమిటి అని అని అధికారులు ప్రశ్నించగా.. సారానే అని సమాధానం ఇచ్చాం’ అని ఓ కుటుంబం ఈటీవీతో చెప్పింది. అనారోగ్య కారణాలతో మృతి చెందారని రాతపూర్వకంగా ఇవ్వాలని అధికారులు వారికి సూచించడంతో.. అందుకు వారంతా ఆగ్రహం చెందారని తెలిసింది. ఆ విధంగా వాంగ్మూలాన్ని ఇవ్వలేమంటూ కచ్చితంగా చెప్పి బయటకు వచ్చేశారని సమాచారం.
ఇదీ చదవండి: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. ప్రాంగణానికి చేరుతున్న శ్రేణులు