ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆరోపణలు నిరూపణ కాకముందే వైద్యుడి అరెస్ట్' - eluru doctor murali krishna arrest issue

ఏలూరు వైద్యుడు మురళీకృష్ణపై వచ్చిన ఆరోపణలు నిరూపణ కాకముందే అరెస్ట్ చేయటం సరికాదని....ఏపీ డీజీపీకి భారత వైద్య సంఘం లేఖ రాసింది.

indian medical association letter to ap dgp sawang
ఏపీ డీజీపీకి భారత వైద్య సంఘం లేఖ

By

Published : Sep 9, 2020, 7:36 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైద్యుడు మురళీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని భారత వైద్య సంఘం ఓ పత్రికా ప్రకటనలో ఖండించింది. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్​కు లేఖ రాసింది. డా. మురళీ కృష్ణపై చేసిన ఆరోపణలు నిరూపణ కాకముందే అరెస్ట్ చేయటం సరికాదని ఐఎంఏ అభిప్రాయడింది. 50 పడకలు ఉన్న ఆసుపత్రిలో 10 లక్షల రూపాయల విలువ చేసే రెమిడెసివీర్ మెడిసిన్ ఉందని, ప్రభుత్వానికి సంబంధించిన టెస్టింగ్ కిట్లు ఆసుపత్రిలో లభించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ పూర్తి కాకముందే అరెస్ట్ చేయటాన్ని పరిశీలించాలని డీజీపీని లేఖలో కోరింది.

ABOUT THE AUTHOR

...view details