ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి పేర్ని నాని - 74వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.

స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి పేర్నినాని... జాతీయ జెండా ఆవిష్కరణ
స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి పేర్నినాని... జాతీయ జెండా ఆవిష్కరణ

By

Published : Aug 15, 2020, 4:36 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసు పరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పేర్ని నాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ ముత్యాలరాజు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఎడితెరిపిలేని వర్షం వల్ల జరగాల్సిన ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు.

మంత్రి పేర్ని నాని వర్షంలోనే జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ప్రపంచానికి సవాల్ విసురుతున్న కొవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొందామని మంత్రి అన్నారు. స్వీయ భద్రత పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి :జిల్లాలో భారీ వర్షం... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

ABOUT THE AUTHOR

...view details