ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరు లైవ్ అప్​డేట్స్: రోగుల రక్తంలో సీసం ఆనవాళ్లు - ఏలూరులో పెరుగుతున్న రోగుల సంఖ్యం

eluru live updates
eluru live updates

By

Published : Dec 8, 2020, 6:42 AM IST

Updated : Dec 8, 2020, 9:48 PM IST

21:45 December 08

ఎరువులు, పురుగుమందుల వల్లే జరిగి ఉండొచ్చు..!

  • ఏలూరులో వింతవ్యాధి క్రమేణా తగ్గుముఖం: ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఏవీఆర్ మోహన్‌
  • పరిశీలనకు ఎన్‌సీడీసీ నిపుణులు కూడా వస్తున్నారు
  • రోగులు తిన్న ఆహార నమూనాలను పరీక్షా కేంద్రాలకు పంపాం
  • వింతవ్యాధికి కారణం ఏమిటో ఇప్పటికీ తెలియదు
  • పంటలపై వాడే పురుగుమందులు కూడా కారణం కావొచ్చు
  • జిల్లాలో వాడే రసాయనాలు, పురుగుమందుల వివరాలు ఐఐసీటీకి ఇచ్చాం
  • వంకాయలు, మిర్చిపై రసాయనాలు చల్లుతున్నారని తెలుస్తోంది
  • ప్రస్తుతం పంపునీరు తాగవద్దని ప్రజలకు సూచించాం
  • కూరగాయలను ఉప్పునీటిలో కడిగి వినియోగించాలి
  • తాగునీరు, పాలు, కూరగాయలకు మరోసారి పరీక్షలు చేయిస్తాం
  • నమూనాలు పూర్తిగా విశ్లేషించాకే రోగకారణాలు తెలుస్తాయి
  • ప.గో.జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు
  • ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పడకల సామర్థ్యం పెంచాం
  • ఎక్కడికక్కడ ప్రాథమిక చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు
  • ఏలూరు గ్రామీణ ప్రాంతాల్లో 80కి పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు
  • తిరుపతి స్విమ్స్ నుంచి వైద్యనిపుణులను రప్పించాం
  • ఎరువులు, పురుగుమందుల వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నాం
  • వ్యాధిని తెలుసుకునేందుకు కేంద్రబృందాలు పరిశీలిస్తున్నాయి: ఏవీఆర్ మోహన్‌
  • తరచుగా మూర్ఛ వచ్చే కేసులు 3 మాత్రమే ఉన్నాయి: ఏవీఆర్ మోహన్‌

21:10 December 08

561కి చేరిన బాధితుల సంఖ్య

ఏలూరులో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 561కి చేరింది. ఇప్పటివరకూ 450 మంది పూర్తిగా కోలుకుని డిశ్ఛార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 29 మందిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించినట్టు వెల్లడించింది. ఇ-కొలి లాంటి బ్యాక్టీరియాల పరిశీలనకు 22 నీటి నమూనాలను విశ్లేషిస్తే బ్యాక్టీరియా పరిమిత స్థాయిలోనే ఉందని అయితే పురుగుమందుల అవశేషాలు వెలుగు చూసినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం 62 రక్త నమూనాల్లో పది శాంపిళ్లలో పరిమితికి మించి నికెల్, సీసం లాంటి భారలోహాలు ఉన్నట్టుగా తేలిందని ప్రభుత్వం తెలియజేసింది. లోతైన విశ్లేషణ కోసం దిల్లీలోని ఎయిమ్స్​కు మరో 40 నమూనాలు పంపించినట్టు స్పష్టం చేసింది. వెన్నెముక నుంచి తీసిన నమూనాలలోనూ కల్చర్ టెస్టుల్లోనూ వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని వెల్లడించింది. ప్రస్తుతం కణజాల పరీక్ష కోసం సీసీఎంబీకి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి కూరగాయల నమూనాలను పంపించారు. వీటి వివరాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

14:19 December 08

ఏలూరులో అస్వస్థతకు గురైనవారికి వైద్య పరీక్షలపై సీఎం జగన్‌ ఆరా

  • ఏలూరులో అస్వస్థతకు గురైనవారికి వైద్య పరీక్షలపై సీఎం జగన్‌ ఆరా
  • పరీక్షల వివరాలను సీఎం జగన్‌కు తెలిపిన సీఎంవో అధికారులు
  • ఎయిమ్స్‌ వైద్య నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన అధికారులు
  • పరీక్షల్లో సీసం, నికెల్‌ వంటి మూలకాలు ఉన్నట్లు తెలుస్తోందన్న అధికారులు
  • ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని... ఆ వివరాలు త్వరలో వస్తాయని వెల్లడి
  • మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని సీఎం జగన్‌కు తెలిపిన అధికారులు
  • ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం ఆదేశం
  • సీసం వంటి మూలకాలు శరీరాల్లోకి ఎలా చేరాయో పరిశీలించాలన్న సీఎం
  • అస్వస్థతకు దారితీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలని సీఎం ఆదేశం
  • ప్రజారోగ్య సిబ్బంది, ఇతర విభాగాలు నిశిత పరిశీలన చేయాలని ఆదేశం
  • రేపు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు చేయాలన్న సీఎం జగన్

13:50 December 08

పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది: ఆళ్ల నాని

కేంద్రప్రభుత్వ రంగ సంస్థల నివేదిక వచ్చిన తర్వాతే.. ఏలూరులో బయటపడ్డ అస్వస్థతకు కారణాలు తెలుస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని.. రోగుల సంఖ్య 120కి దిగివచ్చినట్లు తెలిపారు. ఏలూరు పరిధిలో నీటిసరఫరా జరుగుతున్న ఓవర్‌హెడ్ ట్యాంకులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాథమిక నివేదికలో సీసం ఉన్నట్టు తేలినప్పటికీ.. పూర్తిస్థాయిలో నిర్ధరించాల్సి ఉందంటున్న ఆళ్ల నాని అన్నారు.

13:49 December 08

ఏలూరులో పర్యటించిన వైద్య నిపుణుల బృందాలు

ఏలూరులో వింత వ్యాధికి సంబంధించి కేంద్ర బృందాలు నమూనాలు సేకరిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వివిధ రకాల నమూనాలను సేకరిస్తున్నారు. మూర్ఛరోగం సోకిన ప్రాంతంలోని రోగుల ఇళ్లకు వెళ్లి వారు తీసుకున్న ఆహార పదార్థాల నమూనాలను తీసుకుంటున్నారు. వీటిని విశ్లేషించి సమస్య ఎక్కడ ఉన్నది అనేది తేలుస్తామని కేంద్ర బృందాలు తెలియజేశాయి.

11:08 December 08

రోగుల రక్త నమూనా నివేదికలో సీసం టాక్టిన్స్ ఆనవాళ్లు: ఏలూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్

ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న వారి నమూనాల పరీక్షల్లో సీసం టాక్టిన్స్ ఆనవాళ్ళు ఉన్నట్లు వెల్లడైంది. ఈ మేరకు ఎయిమ్స్ నివేదికలో పేర్కొన్నట్లు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏ.వి.ఆర్ మోహన్ వెల్లడించారు. మరింత స్పష్టమైన ఫలితాల కోసం మరో 40 మంది రక్త, మూత్ర నమూనాలు సేకరించి దిల్లీ ఎయిమ్స్‌కు పంపించామన్నారు. మరోవైపు.. సీసీఎంబి రిపోర్టు కూడా రావాల్సి ఉందన్నారు. అయితే.. సీసం టాక్టిన్స్ ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నమూనాలు సేకరిస్తోందన్నారు. డ్యూహెచ్​వో , దిల్లీ ఎయిమ్స్ బృందాలు కూడా ఏలూరులో పర్యటిస్తూ పరిశోధనలు కొనసాగిస్తున్నాయన్నారు. బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించారు. 

08:55 December 08

ఏలూరులో 505కు చేరిన అంతుచిక్కని వ్యాధి బాధితులు

  • ఏలూరులో 505కు చేరిన అంతుచిక్కని వ్యాధి బాధితులు
  • 3 రోజుల్లో 332 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
  • ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 153 మంది బాధితులు
  • మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడకు 19 మంది తరలింపు
  • చికిత్స పొందుతున్న వారిలో 71 మంది చిన్నారులు, 27 మంది మహిళలు

07:01 December 08

ఏలూరులో ప్రజల అస్వస్థతకు భారలోహం సీసమే కారణం: భాజపా ఎంపీ జీవీఎల్

  • ఏలూరులో ప్రజల అస్వస్థతకు భారలోహం సీసమే కారణమని భాజపా ఎంపీ జీవీఎల్‌ అన్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్‌ లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. సీసం, నికెల్‌ లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు దిల్లీ ఎయిమ్స్‌ పరీక్షల్లో తేలిందని వెల్లడించారు. సీసం కారణంగానే న్యూరో టాక్సిక్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండవచ్చన్న ఎంపీ.. పరీక్షల వివరాలు మంగళగిరి ఎయిమ్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందాయని తెలిపారు. తాగునీరు, పాల నమూనాలు పంపాలని దిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని జీవీఎల్‌ అన్నారు.

06:53 December 08

మూడు రోజుల్లో అనారోగ్యం బారినపడిన 488 మంది బాధితులు

  • ప.గో.: ఏలూరులో అలజడి సృష్టిస్తున్న అంతుచిక్కని వ్యాధి
  • మూడు రోజుల్లో అనారోగ్యం బారినపడిన 488 మంది బాధితులు
  • 3 రోజుల్లో 332 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
  • ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 138 మంది బాధితులు
  • మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడకు 18 మంది తరలింపు
  • ఇవాళ ఏలూరులో పర్యటించనున్న వైద్య నిపుణుల బృందాలు
  • ఇప్పటికే ఏలూరు చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందాలు
  • ఇవాళ ఏలూరులో పర్యటించి నమూనాలు సేకరించనున్న డబ్ల్యూహెచ్‌వో బృందం
  • కొందరు బాధితులతో మాట్లాడనున్న డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు
  • అనారోగ్య సమస్యకు కారణమేమిటో అధ్యయనం చేయనున్న బృందాలు
  • ఏలూరులో పర్యటించనున్న కేంద్ర ఆరోగ్యశాఖ ముగ్గురు సభ్యుల బృందం
  • ఏలూరులో వారంపాటు పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం

06:31 December 08

లైవ్ అప్​డేట్స్: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సృష్టించిన కలకలం కొనసాగుతూనే ఉంది. ఓపక్క వ్యాధి మూలాలేమిటో తెలియకపోవడం, మరోవైపు ఆసుపత్రులకు వచ్చే బాధితుల సంఖ్య తగ్గకపోవడం కలవరపెడుతోంది. వరుసగా మూడో రోజు కూడా మూర్ఛ, ఇతర లక్షణాలతో వంద మందికిపైగా జిల్లా ఆసుపత్రిలో చేరారు. బాధితుల సంఖ్య 400 దాటింది. బాధితుల నుంచి రక్తం, ప్రభావిత ప్రాంతాల నుంచి నీరు, ఆహార నమూనాలను సేకరించి స్థానికంగానూ, రాష్ట్ర స్థాయిలో పరిశీలించినా ఎలాంటి స్పష్టతా రాలేదు. దీంతో జాతీయ పరిశోధన సంస్థల పరీక్షలపైనే ఆశలన్నీ నిలిచాయి.

Last Updated : Dec 8, 2020, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details