ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court Justice: ద్వారకా తిరుమలేశున్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి - High court Justice Visisted Dwaraka tirumala

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

High Court Justice
ద్వారకా తిరుమలేశున్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

By

Published : Oct 30, 2021, 1:00 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి శనివారం ఉదయం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆలయ అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించి.. శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని ఇచ్చి వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆలయ ఏఈవో మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామి వారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details